Friday, April 11, 2008

ఆనందాన్ని పంచుకోవాలి..

చెప్పుకుంటే పోతుందంటారు బాధ..
మరి ఆనందం?! చెప్పుకుంటే పోతుంది.. పెరిగిపోతుంది... మనసైన వాళ్ళతో చెప్పుకుంటే వెయ్యి రెట్లవుతుంది.. :)
గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది.. ప్రపంచంలోని ఆనందం అంతా మనదే ఐపోయినట్టుంటుంది..
మనసైన వాళ్ళు అంటే?? అయ్యో...మనసిచ్చిన వాళ్ళు వేరు...మనసైన వాళ్ళు వేరు...
మనసైన వాళ్ళు అంటే..మనసారా మాట్లాడించే నేస్తాలు.. :)
అమ్మ.. నాన్న.. చెల్లి.. అన్నయ్య..ఎవ్వరితోనైనా..పంచుకుంటే ఆనందం అర్ణవమౌతుంది..
ఎవ్వరున్నారు నా మాటలు వినడానికి అని అనుకుంటే చక్కని నేస్తం...మన డైరీ ...
రోజూ డైరీ రాయలేకపోయినా అత్యంత ఆనందకరమైన క్షణాలనైనా డైరీలో నిక్షిప్తం చేస్తే.. మళ్ళి ఆ పేజీలను తిరగేసినప్పుడు అదే ఆనందం మన మనసును తాకదంటారా?

No comments:

Post a Comment