Friday, April 11, 2008

campus లో సాయంత్రం..

సాయంకాలం.. ఎన్నో కబుర్లతో చిరుగాలి.. మా campus అందాలను వదిలి వెళ్ళలేనట్టు సూర్యుడు కొండల వెనకాలనించి చూస్తున్నాడు.. ఇక ఆకాసరాజ్యం నాదే అంటూ చంద్రుడు అప్పుడే వెలిగిపోతున్నాడు..
ఎవరి చిరునామాకు వారిని చేర్చడానికి బస్సులు సిద్ధంగా ఉన్నాయి..
అదిగో వచ్చేస్తున్నారు మన కథానాయకులు... నాయికలు..
యువ జంటలు ఒక్కొక్కటిగా బస్సుల దగ్గరకి చేరుతున్నాయి..
అలరి మూకలు, పుస్తకాల పురుగులు, మాటల పుట్టలు, షోగ్గాళ్ళు, వయారి భామలు.. వాలు చూపులూ ఆహా ఏమి కళ మా కాలేజీ కి?!!!
చిలిపి smsల సందేశాలతో తో గాలి busy అయిపోయింది..
సరదా ringtones తో వాతావరణం సరదా సరదాగా మారిపోయింది..
ఇక చూపుల రాయబారాలది ఎప్పుడూ అగ్రస్తానమే..
బస్సుల దగ్గర గుంపులు గుంపులుగా చేరి కబుర్లు...
క్లాసులు జరిగేడప్పుడు, కాంటీన్లో.. ఎప్పుడూ మాట్లాడడమే కదా.. అయినా ఆగని ప్రవాహాలు...
బస్సుల హారన్ మోత తో ముగింపుకొస్తాయి...
అదిగో.. గాలి మళ్లీ బై బై ల తో busy..
bus లో కొందరు cell phone తో , మరికొందరు పక్కవాళ్ళతో కబుర్లతో busy.. అవేవి కుదరని వాళ్లు.. నిద్రలోకి జారుకుంటారు....
అదీ మా campus లో సాయంత్రం సంగతి.. :)

No comments:

Post a Comment